డివైడర్‌ను ఢీకొన్న కారు...ఐదుగురి దుర్మరణం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందారు. పుణ్యక్షేత్రాల దర్శనార్థం సోలాపూర్‌ నుంచి 9 మంది మిత్రబృందం తిరుమల వచ్చింది.

Published : 26 Jan 2023 05:08 IST

చంద్రగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందారు. పుణ్యక్షేత్రాల దర్శనార్థం సోలాపూర్‌ నుంచి 9 మంది మిత్రబృందం తిరుమల వచ్చింది. శ్రీవారిని దర్శించుకున్నాక... బుధవారం మధ్యాహ్నం కాణిపాకం వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని కల్‌రోడ్డుపల్లి జాతీయ మార్గంలో కల్వర్టును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో వాహనం సగభాగం వరకు దెబ్బతింది. అత్తర్‌ అనంత్‌ తెంబునీకర్‌ (20), మయూర దయానంద్‌ మత్‌పతి (28), రిషికేష్‌ మధుసూదన్‌ జంగం (32), అజయ్‌ నంగనాథ్‌ లుత్తే (31) దుర్మరణం చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంబదాస్‌ కుమార్‌ (32) చనిపోయారు. మరో నలుగురు తీవ్రగాయాలతో రుయా ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్నారని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు