రైలు ఇంజిన్‌కు చిక్కిన మృతదేహం

చెన్నై- లక్నో అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌కు చిక్కిన మృతదేహాన్ని 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణం తర్వాత గుర్తించారు.

Published : 27 Jan 2023 03:55 IST

జమ్మికుంట, న్యూస్‌టుడే: చెన్నై- లక్నో అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌కు చిక్కిన మృతదేహాన్ని 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణం తర్వాత గుర్తించారు. లోకో పైలట్‌ జమ్మికుంటలో రాత్రి 7.30 గంటల సమయంలో స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం ఇచ్చారు. ఇంజిన్‌ నుంచి మృతదేహాన్ని తీసేందుకు 2 గంటలు పట్టింది. స్థానికులు గడ్డపారతో తవ్వి మృతదేహాన్ని ఇంజిన్‌ నుంచి బైటకు తీయాల్సి వచ్చింది. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ద్వారా మృతుడు హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన గద్వాల ఉప్పలయ్య (72)గా గుర్తించారు. ఆధార్‌కార్డు వెనుక వైపు తన చావుకు ఎవరూ కారణం కాదని రాసుకున్నారు. ఉప్పలయ్య వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పారిశుద్ధ్య విభాగం (హనుమకొండ)లో జవాన్‌గా పని చేసి 12 ఏళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని మేనల్లుడు శ్రీనివాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. గురువారం 4 గంటల సమయంలో ఇంటి వద్దనే ఉన్నారని తరవాత కాజీపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడవచ్చని కుటుంబసభ్యులు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు