కర్ణాటక మద్యంతో పట్టుబడిన వైకాపా నాయకుడు

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రజని దొంగనోట్ల కేసులో అరెస్టయిన సంఘటనను మరువకముందే మరో వైకాపా నాయకుడు గురువారం అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.

Published : 27 Jan 2023 06:44 IST

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు, బి.మఠం: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రజని దొంగనోట్ల కేసులో అరెస్టయిన సంఘటనను మరువకముందే మరో వైకాపా నాయకుడు గురువారం అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. బ్రహ్మంగారిమఠం మండల వైకాపా సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఇండ్ల శివరామ్‌ నుంచి రూ.20 లక్షల విలువైన 50 కేసుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాజీపేట మీదుగా స్వగ్రామం బ్రహ్మంగారిమఠానికి కారులో ఆయన మద్యాన్ని తరలిస్తున్నారు. నిందితుడితోపాటు స్వాధీనం చేసుకున్న కారు, మద్యం కేసులను కడప ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పందించారు. శివరామ్‌కు పార్టీపరంగా ఎలాంటి నియామక పత్రం ఇవ్వలేదని.. ఆయనతో వైకాపాకు సంబంధం లేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు