రూ.3వేల కోసం గొడవ.. దళితుడి హత్య

హరియాణాలో రూ.3వేల గురించి జరిగిన గొడవ ఓ దళితుడి హత్యకు దారితీసింది. గురుగ్రామ్‌లో సాగర్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఇందర్‌కుమార్‌ అనే దళితుడికి కరెంట్‌ బిల్లు కట్టాలని రూ.19వేలు ఇచ్చారు.

Published : 27 Jan 2023 04:32 IST

గురుగ్రామ్‌: హరియాణాలో రూ.3వేల గురించి జరిగిన గొడవ ఓ దళితుడి హత్యకు దారితీసింది. గురుగ్రామ్‌లో సాగర్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఇందర్‌కుమార్‌ అనే దళితుడికి కరెంట్‌ బిల్లు కట్టాలని రూ.19వేలు ఇచ్చారు. బిల్లు చెల్లించకుండా అందులోని రూ.3వేలు ఇందర్‌కుమార్‌ ఖర్చు చేసినట్లు తెలుసుకున్న సాగర్‌ తన డబ్బులో మిగిలిన రూ.16,000 వెనక్కి తీసుకున్నారు. వాడుకున్న రూ.3,000 వీలైనంత త్వరగా ఇవ్వాలని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాతి రోజు ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇందర్‌పై దాడిచేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఇందర్‌ ప్రాణాలు కోల్పోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు