Andhra News: అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన కూరపాటి నోవాబాబు మూడున్నరేళ్లుగా చెరుకుపల్లి-1 సచివాలయ పరిధిలోని క్లస్టర్‌-9లో వాలంటీరుగా పనిచేస్తున్నాడు.

Updated : 28 Jan 2023 06:47 IST

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన కూరపాటి నోవాబాబు మూడున్నరేళ్లుగా చెరుకుపల్లి-1 సచివాలయ పరిధిలోని క్లస్టర్‌-9లో వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని చెరుకుపల్లి ఖాదర్‌ఖాన్‌ సెంటర్‌లో అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో సీఐ దేవర శ్రీనివాస్‌ నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత వాలంటీరు నోవాబాబు తెలంగాణకు చెందిన మద్యం సీసాలు విక్రయిస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న సమయంలో తాను వైకాపాకు చెందిన వ్యక్తినని, స్థానికంగా ఉన్న కొందరు వైకాపా నేతలు మద్దతుగా ఉన్నారంటూ బెదిరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు