సంక్షిప్త వార్తలు(2)

గణతంత్ర దినోత్సవం రోజున 14 ఏళ్ల విద్యార్థినిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2023 06:15 IST

గణతంత్ర దినోత్సవం రోజున బాలికపై సామూహిక అత్యాచారం

గణతంత్ర దినోత్సవం రోజున 14 ఏళ్ల విద్యార్థినిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక పాఠశాలకు వెళ్తుండగా దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. శివారులోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక ఇంటికి చేరుకుని.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఆరో అంతస్తు నుంచి శునకం విసిరివేత

ఇందౌర్‌: గుర్తు తెలియని వ్యక్తులు ఓ శునకాన్ని ఆరో అంతస్తు నుంచి విసిరివేయడంతో తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగింది. ఇక్కడి రాయల్‌ అమర్‌ గ్రీన్‌ అపార్టుమెంటు నుంచి నిందితులు శునకాన్ని విసిరివేశారు. స్థానిక జంతు ప్రేమికుడొకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు