కుస్తీ పోటీల్లో అపశ్రుతి

వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ పోటీదారుడు తన ప్రత్యర్థి గొంతుపై తొడతో బలంగా నొక్కడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

Updated : 28 Jan 2023 06:15 IST

గొంతుపై నొక్కడంతో ఊపిరాడక పోటీదారు మృతి

లఖీసరాయ్‌: వసంత పంచమి సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ పోటీదారుడు తన ప్రత్యర్థి గొంతుపై తొడతో బలంగా నొక్కడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌లోని లఖీసరాయ్‌ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుసేనా గ్రామంలో వసంత పంచమి రోజున కుస్తీ పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జెనూ యాదవ్‌, పట్నా జిల్లాకు చెందిన త్రిపురారి కుమార్‌ బరిలో దిగారు. ఈక్రమంలో త్రిపురారి యాదవ్‌ గొంతుపై జెనూ యాదవ్‌ తన తొడను బలంగా నొక్కి ఉంచాడు. దీంతో త్రిపురారి శ్వాస ఆడక ప్రాణం వదిలాడు. ఇది తెలిసి రెజ్లింగ్‌ నిర్వాహకులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు