Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి

పదోన్నతుల విషయం మాట్లాడేందుకే తాను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ నివాసానికి వెళ్లినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డి పోలీసులకు తెలిపారు.

Updated : 29 Jan 2023 09:49 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పదోన్నతుల విషయం మాట్లాడేందుకే తాను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ నివాసానికి వెళ్లినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. ఈనెల 19న రాత్రి స్మిత నివాసానికి ఆయనతో పాటు కొత్త బాబు ప్లజెంట్‌ వ్యాలీలోకి ప్రవేశించి పోలీసులకు చిక్కిన విషయం విదితమే. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నవారిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.

విచారణలో.. తనతోపాటు 9 మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయం మాట్లాడేందుకు తాను స్మితా సభర్వాల్‌ ఇంటికి వెళ్లినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రాత్రివేళ ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేదని పేర్కొన్నారు. 1996 గ్రూపు-2లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టింగులు కోర్టు వివాదంతో రద్దయ్యాయని, 2018లో మళ్లీ కోర్టు జోక్యంతో డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగులు వచ్చాయని, వారిలో 16 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, 10 మందికి తెలంగాణలో పోస్టింగ్‌లు వచ్చాయని, అందులో తాను ఒకడినని డీటీ చెప్పినట్లు వివరించారు.

ఏపీకి వెళ్లినవారికి పదోన్నతులు రాగా తామింకా డీటీలుగానే ఉన్నామని ఈ విషయం చెప్పేందుకు వెళదామనుకున్నానని పేర్కొన్నట్లు తెలిపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో హోటల్‌లో టీ తాగడానికి వెళ్దామంటూ తీసుకొచ్చి తనను ఇలా ఇరికించారంటూ కొత్త బాబు వాపోయినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు