శ్రీశైలం మార్గంలో త్రుటిలో తప్పిన ప్రమాదం

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Published : 30 Jan 2023 04:59 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి 35 మంది ప్రయాణికులతో టీఎస్‌ఆర్టీసీకి చెందిన అద్దె బస్సు మహబూబ్‌నగర్‌కు బయల్దేరింది. జలాశయం ఎగువన ఉన్న ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ ధ్వంసమైనా... అక్కడ ఏర్పాటుచేసిన ఇనుప దిమ్మెల కారణంగా బస్సు అక్కడే ఆగిపోయింది. ఇనుప దిమ్మెలు లేకపోతే బస్సు లోయలో పడిపోయేది. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే కిందకి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం డ్రైవర్‌ బస్సును అక్కడి నుంచి బయటకు తీసి మళ్లీ ప్రయాణికులను ఎక్కించుకుని మహబూబ్‌నగర్‌ వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని