సిమెంటు పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

ఓ సిమెంటు పరిశ్రమలో అనూహ్యంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో సోమవారం జరిగింది.

Published : 31 Jan 2023 04:36 IST

మఠంపల్లి, న్యూస్‌టుడే: ఓ సిమెంటు పరిశ్రమలో అనూహ్యంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో సోమవారం జరిగింది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మునగపాటి సైదులు(46), పట్టేటి సాయికుమార్‌(23) స్థానిక గ్రేగోల్డ్‌ సిమెంటు పరిశ్రమలో కిలిన్‌ యంత్రం వద్ద విధుల్లో ఉండగా ఒక్కసారిగా వెనుక నుంచి మంటలు వ్యాపించడంతోపాటు అత్యధిక ఉష్ణోగ్రతతో ఉండే రాతి పొడి వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. హుజూర్‌నగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మునగపాటి సైదులు మృతిచెందారు. సాయికుమార్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో కార్మికుడు జి. సైదులు ప్రస్తుతం కోదాడలో చికిత్స పొందుతున్నారు. నవంబరులో ఇదే పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందారు. యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబసభ్యులతోపాటు స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు కర్మాగారం వద్ద ధర్నా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని