గంజాయి గ్యాంగ్‌ ఆగడాలను భరించలేకపోతున్నాం

‘ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు.

Published : 01 Feb 2023 04:58 IST

తాడేపల్లి స్టేషన్‌కు వచ్చిన లంబాడీపేట మహిళలు
సీఎం ఇంటి సమీపంలో దుస్థితిపై ఆవేదన

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తాడేపల్లి: ‘ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వారితో మాకు నిద్రాహారాలు ఉండటం లేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం’ అని లంబాడీపేట మహిళలు మంగళవారం తాడేపల్లి స్టేషన్‌ తలుపుట్టారు. సీఎం నివాసానికి అర కిలోమీటరు దూరంలోనే లంబాడీపేట ఉంటుంది. రెండురోజుల క్రితం ఇంట్లో ఉన్న బాలుడిని తీసుకెళ్లి గంజాయి బ్యాచ్‌ బీరు సీసాతో తీవ్రంగా దాడిచేసి గాయపరిచిందని, ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నా పోలీసులు పట్టించుకోవటం లేదని మహిళలు స్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉండే కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ యార్డులను అడ్డాగా చేసుకుని గంజాయి గ్యాంగులు చెలరేగుతున్నాయని వారు తెలిపారు. సాయిబాబా మందిరం వద్ద నుంచి ముగ్గురోడ్డు వరకు వీరి ఆగడాలు, అకృత్యాలు పోలీసులకు పట్టడం లేదన్నారు. కొద్దిరోజుల క్రితం ఓ హోంగార్డును రక్తం చిందేలా గాయపరిచారని, ద్విచక్ర వాహనంపై వెళుతున్న తండ్రీకుమార్తెలపై దాడికి తెగబడ్డారని, తాజాగా తమ కాలనీకి చెందిన ఓ యువకుడిని బీరుబాటిళ్లతో పొడవడంతో వారి ఆగడాలను భరించలేక స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు