ఆయువు తీసిన చలిమంటలు

చలి కాచుకునేందుకు వేసుకున్న మంటల్లో పడి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్‌ గ్రామానికి చెందిన మాల బజారమ్మ(78) సోమవారం వేకువజామున చలిమంట వేసుకున్నారు.

Published : 02 Feb 2023 04:53 IST

దేవనకొండ, న్యూస్‌టుడే: చలి కాచుకునేందుకు వేసుకున్న మంటల్లో పడి ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్‌ గ్రామానికి చెందిన మాల బజారమ్మ(78) సోమవారం వేకువజామున చలిమంట వేసుకున్నారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి లేవబోతూ మంటల్లో పడిపోయారు. వృద్ధురాలు కావడంతో బోర్లాపడటంతో అందులోంచి లేవలేకపోయారు. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గమనించి ఆమెను మంటల్లోంచి తీశారు. అప్పటికే తీవ్ర గాయాలు కాగా.. 108 అంబులెన్సు వాహనంలో ఆదోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని