Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్‌ హీటర్‌ తగిలి తండ్రి, కుమార్తె మృతి

విద్యుదాఘాతంతో తండ్రి, కుమార్తె మృతిచెందిన విషాద ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది.

Updated : 02 Feb 2023 22:20 IST

విజయవాడ: విద్యుదాఘాతంతో తండ్రి, కుమార్తె మృతిచెందిన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సత్యనారాయణపురంలోని రామానగర్‌లో ఇప్పిలి సింహాచలం, అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ, ఆమె భర్త గోపినాథ్‌ నివాసముంటున్నారు. నీళ్లు వేడి చేసేందుకు ఉపయోగించే హీటర్‌ తాకడంతో  సింహాచలం, మంగమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నివాసముంటున్న లక్కవరపు సీత వీరిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. సింహాచలం, మంగమ్మ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో తండ్రి, కుమార్తె మృతి చెందడంతో రామానగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు