విలేకరిపై కాల్పులు... ఆసుపత్రికి తరలింపు

అన్నమయ్య జిల్లా రాయచోటి శివాలయం కూడలి వద్ద ఓ టీవీ ఛానల్‌ విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Published : 03 Feb 2023 04:45 IST

రాయచోటి, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా రాయచోటి శివాలయం కూడలి వద్ద ఓ టీవీ ఛానల్‌ విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పీలేరులో పనిచేస్తున్న పర్వతరెడ్డి (45) గత నెల 31 సాయంత్రం 5.30కు చిత్తూరు రింగ్‌రోడ్డు నుంచి బయలుదేరి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శివాలయం కూడలి వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో గాయపడినట్లు పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వాహనాల టైర్ల కిందినుంచి రాయి వచ్చి తగిలిందని భావించి కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారన్నారు. వైద్యులు శరీరంలో బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించి, వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్‌ను వెలికి తీశారన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి. కాల్పులు జరిపినవారి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. క్షతగాత్రుడికి, వారి బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు