గురుకులంలో విద్యార్థుల ఘర్షణ: ఒకరి మృతి

నిజామాబాద్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. నగర శివారులోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల-2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకొంది.

Updated : 03 Feb 2023 06:39 IST

నిజామాబాద్‌లో ఘటన

నిజామాబాద్‌ నేరవార్తలు, డిచ్‌పల్లి గ్రామీణం- న్యూస్‌టుడే: నిజామాబాద్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. నగర శివారులోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల-2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకొంది. డిచ్‌పల్లి సీఐ మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్‌నగర్‌కు చెందిన సఫియా బేగం కుమారుడు సోఫియాన్‌ (14) మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డులోని గురుకుల పాఠశాల-2లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మెస్‌లో సోఫియాన్‌కు, మరో విద్యార్థి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆ విద్యార్థి.. సోఫియాన్‌ ఛాతీపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన సిబ్బంది ఆ బాలుడిని చికిత్స కోసం హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది తనకు ఫోన్‌ చేసి.. సోఫియాన్‌ అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారని, దవాఖానాకు వెళ్లి చూసేసరికే తన కుమారుడు మృతిచెందాడని బాలుడి తల్లి సఫియా బేగం విలపిస్తూ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు