కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం

కేరళలోని కన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుటినొప్పులు రావడంతో ఆసుపత్రికి బయల్దేరిన ఓ నిండు గర్భిణి, ఆమె భర్త.. కారులో మంటలు రేగడంతో సజీవదహనమయ్యారు.

Updated : 03 Feb 2023 08:52 IST

కన్నూర్‌: కేరళలోని కన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పురుటినొప్పులు రావడంతో ఆసుపత్రికి బయల్దేరిన ఓ నిండు గర్భిణి, ఆమె భర్త.. కారులో మంటలు రేగడంతో సజీవదహనమయ్యారు. వెనుక సీట్లో కూర్చున్న ఓ చిన్నారి సహా నలుగురు కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రీషా(26) అనే మహిళకు గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్త ప్రిజిత్‌(35), కుటుంబ సభ్యులు తనను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కారులో బయలుదేరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపానికి రాగానే ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. ముందు సీట్లలో కూర్చున్న రీషా, ప్రిజిత్‌లను మంటలు చుట్టుముట్టాయి. ముందు వైపు డోర్లకు అగ్నికీలలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారు. వెనక కూర్చున్న నలుగురు కుటుంబ సభ్యులు మాత్రం ఒక్క ఉదుటున బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు