ముఖ్యమంత్రిని దూషించాడని ఏఆర్‌ కానిస్టేబుల్‌ అరెస్టు

ముఖ్యమంత్రిని దూషించాడన్న అభియోగంపై ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైవే రోడ్డుసేఫ్టీ మొబైల్‌ టీంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు.

Updated : 04 Feb 2023 06:14 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిని దూషించాడన్న అభియోగంపై ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైవే రోడ్డుసేఫ్టీ మొబైల్‌ టీంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన్నీరు వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. పోలీసులకు మూడు నెలల జీతాలు వేయకపోతే.. అప్పుడు గవర్నర్‌ పాలన వస్తుందంటూ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు అతనిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చిల్లకల్లు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసి శుక్రవారం సాయంత్రం జగ్గయ్యపేట న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని