రాజస్థాన్‌లో శ్రద్ధావాకర్‌ తరహా హత్య

రాజస్థాన్‌లో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు శ్రద్ధావాకర్‌ తరహా హత్యగా అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి నాగౌర్‌ ప్రాంతానికి చెందిన అనోపారామ్‌కు గుడ్డీ (30) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

Published : 05 Feb 2023 03:54 IST

మృతదేహాన్ని ముక్కలు చేసి బావిలో పడేసిన నిందితుడు!

నాగౌర్‌: రాజస్థాన్‌లో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు శ్రద్ధావాకర్‌ తరహా హత్యగా అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి నాగౌర్‌ ప్రాంతానికి చెందిన అనోపారామ్‌కు గుడ్డీ (30) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. జనవరి 22న ముందాసార్‌లోని అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పిన గుడ్డీ బాలాసార్‌లోని తన పుట్టింటి నుంచి బయలుదేరి అదృశ్యమయింది. రెండు రోజుల తర్వాత ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. 22న ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతుండటంతో గుడ్డీని హతమార్చానని ఒప్పుకొన్నాడు. దర్యాప్తులో భాగంగా ఓ దవడ ఎముక, పొడవు జుట్టు, అమ్మాయి దుస్తులను పోలీసులు రోడ్డు పక్కన గుర్తించారు. పదునైన కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేసి ఆమె స్వగ్రామంలో ఉన్న బావిలో పడేశానని నిందితుడు తెలపడంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు