సంక్షిప్త వార్తలు(3)
విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, కమాడిటీ ట్రేడింగులో సహాయం చేస్తామంటూ నకిలీ కాల్‌సెంటర్‌ను నడుపుతున్న ఓ యువకుడి (28)ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ కాల్‌సెంటర్ నిర్వాహకుడి అరెస్టు
ముంబయి: విదేశీ మారకద్రవ్యం, కరెన్సీ, కమాడిటీ ట్రేడింగులో సహాయం చేస్తామంటూ నకిలీ కాల్‌సెంటర్‌ను నడుపుతున్న ఓ యువకుడి (28)ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఇతను అమెరికాతోపాటు భారత పౌరులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ నకిలీ కాల్‌సెంటర్ నడుస్తోంది. పోలీసులు దాడి చేసినప్పుడు నిర్వాహకుడు పట్టుబడగా.. మరో ఇద్దరు సహాయకులు పారిపోయారు.
ఉపాధి కూలీల ఉసురు తీసిన ఇసుక లారీ
నడచి వెళ్తుండగా ఢీకొనడంతో నలుగురి మృతి
ఆమదాలవలస, న్యూస్‌టుడే: నడచి వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొనడంతో నలుగురు ఉపాధిహామీ కూలీలు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఆమదాలవలస మండలంలో ఉపాధి పనులకు 200 మంది బృందాలుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మండాది గ్రామానికి చెందిన మురువందల పాపమ్మ (50), అంబటి సత్తెమ్మ (55), కురమాన లక్ష్మి (50), అమలాపురం గౌరమ్మ (55) చివరలో ఉన్నారు. ఆమదాలవలస నుంచి పాలకొండ వైపు వేగంగా వెళ్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా గౌరమ్మను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. మృతి చెందిన మహిళలంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే.
ఆటో బోల్తా పడి ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
ప్యాపిలి, న్యూస్‌టుడే: నిత్యం పాఠశాలకు వెళ్లి సంతోషంగా ఇంటికి తిరిగొచ్చే ఇద్దరు చిన్నారులను విధి చిన్నచూపు చూసింది. ఉదయం బస్సులో వెళ్లి సాయంత్రం ఇంటికి ఆటోలో వస్తూ 2 నిమిషాల్లో ఇళ్లకు చేరుతారనగా, ప్రమాదానికి గురై విద్యార్థినులు షాహిదాబీ (13), రజిని (15) చనిపోయారు. ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ విషాదం నంద్యాలజిల్లా ప్యాపిలి మండలం నేరుడుచెర్ల గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 18 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం 5 కి.మీ.దూరంలోని రాచర్ల ఉన్నత పాఠశాలకు ఉదయం బస్సులో వెళతారు. సాయంత్రం ఇంటికి చేరుకునేందుకు బస్సు లేక ఆటోను బాడుగకు మాట్లాడుకున్నారు. రోజూ ఆటోను మదార్‌సా నడిపేవారు. శనివారం అత్యవసర పనిపై ఆయన వేరే గ్రామానికి వెళుతూ అదే గ్రామానికి చెందిన శివకు ఆటోను ఇచ్చి పంపించారు. అతను పాఠశాల వదిలాక విద్యార్థులను ఆటోలో ఎక్కించుకొని వస్తుండగా గ్రామ సమీపంలో రహదారి సరిగా లేక అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో చనిపోయిన షాహిదాబీ.. ఆటోడ్రైవర్ మదార్‌సా కుమార్తె కావడం విషాదాన్ని పెంచింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్‌సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్‌పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు