ఉపాధి కూలీల ఉసురు తీసిన ఇసుక లారీ

నడచి వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొనడంతో నలుగురు ఉపాధిహామీ కూలీలు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

Published : 05 Feb 2023 05:00 IST

నడచి వెళ్తుండగా ఢీకొనడంతో నలుగురి మృతి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: నడచి వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొనడంతో నలుగురు ఉపాధిహామీ కూలీలు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఆమదాలవలస మండలం మండాది వద్ద కొండచెరువులో ఉపాధి పనులకు 200 మంది బృందాలుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మండాది గ్రామానికి చెందిన మురువందల పాపమ్మ(50), అంబటి సత్తెమ్మ(55), కురమాన లక్ష్మి(50), అమలాపురం గౌరమ్మ(55) చివరలో ఉన్నారు. ఆమదాలవలస నుంచి పాలకొండ వైపు వేగంగా వెళ్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా గౌరమ్మను శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. మృతి చెందిన మహిళలంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని