అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

సాగు కోసం చేసిన రుణాన్ని తీర్చేదారి లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని కనగాలవారిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 04:44 IST

కనగాలవారిపాలెం (మేదరమెట్ల), న్యూస్‌టుడే: సాగు కోసం చేసిన రుణాన్ని తీర్చేదారి లేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు పంచాయతీ పరిధిలోని కనగాలవారిపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కనగాలవారిపాలెం గ్రామానికి చెందిన కనగాల శ్రీనివాసరావు(56)కు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. గత ఏడాది ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రెండు వందల ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ వేశారు. ఈ ఏడాది గ్రామంలో 14 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశారు. శనగలో నష్టం రాగా ప్రస్తుతం మిరప దెబ్బతింది. సాగు కోసం సుమారు రూ.70 లక్షల వరకు అప్పు చేశారు. కొద్దిరోజుల క్రితం ఎకరం పొలం అమ్మి కొంతమేర అప్పులు తీర్చినట్లు సన్నిహితులు తెలిపారని ఎస్సై చెప్పారు. మిగిలిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇంటి వద్దనే పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని