రహదారిపై 20 కిలోల మందుపాతర గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించి ఆదివారం పేల్చేశారు.

Updated : 06 Feb 2023 06:28 IST

పేల్చివేసిన బాంబ్‌ స్క్వాడ్‌.. తప్పిన ముప్పు
మావోయిస్టుల కుట్ర భగ్నం

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ రహదారిపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పోలీసులు గుర్తించి ఆదివారం పేల్చేశారు. దీంతో పెద్దముప్పు తప్పినట్లయింది. సీఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోదనెల్లి-ఎర్రబోరు రహదారిలో చర్ల పోలీసులు, ప్రత్యేక, సీఆర్పీఎఫ్‌ బలగాలు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందం శనివారం తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో రహదారిపై మావోయిస్టులు అమర్చిన 20 కిలోల భారీ మందుపాతరను గుర్తించాయి. ఆదివారం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం ఆ మందుపాతరను పేల్చివేసి మావోయిస్టుల కుట్రను భగ్నం చేసింది. దీన్ని గుర్తించకుంటే భారీ నష్టం జరిగేదని సీఐ పేర్కొన్నారు. మావోయిస్టులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని