అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం

పంట దిగుబడి ఆశించిన విధంగా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే బాధతో ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 06 Feb 2023 04:38 IST

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: పంట దిగుబడి ఆశించిన విధంగా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే బాధతో ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోటం గ్రామానికి చెందిన లింగం(32) తనకున్న రెండెకరాల్లో గత ఏడాది పత్తి సాగు చేయగా వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఈ ఏడాది వేరుసెనగ పంట సాగు చేశారు. ఈ పంటల పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశారు. దిగుబడి ఏ మాత్రం రాకపోవడంతో కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఆదివారం నడింపల్లి చెరువు సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోవర్ధన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని