Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
తాను ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం చేశారన్న బాధతో ఓ యువకుడు శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
విషమంగా ఆరోగ్యం
నాయుడుపేట (ఓజిలి), న్యూస్‌టుడే: తాను ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం చేశారన్న బాధతో ఓ యువకుడు శరీరంపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోట మండలం చంద్రశేఖరపురం ఎస్టీ కాలనీకి చెందిన కొట్లపూడి తేజ డిగ్రీ చదువుతున్నాడు. ఇతను ఓజిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి మరొకరితో వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలియడంతో ఆదివారం ఉదయం ఆ గ్రామానికి వెళ్లాడు. యువతి ఇంటికి వద్దకు వెళ్లి పిలవగా ఆమె రాకపోడంతో అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయాడు. రెండోసారి ఇంటి వద్దకు వచ్చిన యువకుడు వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో స్థానికులు స్పందించి మంటలు అదుపుచేశారు. 108లో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
India News
‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!