ఏనుగుల దాడిలో ట్రాకర్‌ మృతి

విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్‌ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Published : 07 Feb 2023 05:20 IST

భామిని, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా భామిని మండలంలో ఏనుగుల గుంపు కదలికలను గమనిస్తూ.. వాటిని దూరంగా తరిమే విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (26) అనే ట్రాకర్‌ దురదృష్టవశాత్తు వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అటవీశాఖ సెక్షన్‌ అధికారి హరికృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పసుకిడి గ్రామ సమీపంలో పత్తి పంట వైపు ఏనుగులు రావడాన్ని ట్రాకర్లు గమనించారు. దివిటీలు వెలిగించి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో అవి ఎదురు దాడికి దిగి వారిని వెంబడించాయి. లోకుండా లక్ష్మీనారాయణ పత్తి చేలో వేగంగా పరిగెత్తలేక కింద పడిపోయారు. ఏనుగులు తొక్కేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన గురించి అటవీ శాఖ ఉన్నతాధికారులకు తోటి ట్రాకర్లు, కుటుంబసభ్యులు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సవర తిడ్డిమి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అటవీ శాఖలో పొరుగు సేవల ఉద్యోగి. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న బిడ్డను కోల్పోయి.. తల్లిదండ్రులు సింహాచలం, అప్పలమ్మ తల్లడిల్లిపోతున్నారు. గతనెలలో తాలాడ గ్రామంలో రైతు గోపిశెట్టి చిన్నారావును పొట్టన పెట్టుకున్న ఏనుగులు ఇప్పుడు లక్ష్మీనారాయణ ప్రాణాలు తీయడంతో భామిని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు