మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడి మేనల్లుడి అపహరణ, హత్య

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు విజేందర్‌ చౌహాన్‌ ఆరేళ్ల మేనల్లుడు హర్షసింగ్‌ చౌహాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి హత్య చేశారు.

Updated : 07 Feb 2023 06:25 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు విజేందర్‌ చౌహాన్‌ ఆరేళ్ల మేనల్లుడు హర్షసింగ్‌ చౌహాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి హత్య చేశారు. మహూ ప్రాంతం కిషన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిడ్గాంబర్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం హర్షసింగ్‌ అపహరణకు గురయ్యాడు. గనుల తవ్వకం వ్యాపారి అయిన జితేంద్రసింగ్‌ చౌహాన్‌ కుమారుడైన హర్షసింగ్‌ ఆదివారం ఇంటి ముంగిట ఆడుకుంటూ ఉన్నట్టుండి మాయమయ్యాడు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు స్థానికంగా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకుడు విజేందర్‌కు ఓ నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నీ మేనల్లుడిని విడుదల చేయాలంటే రూ.4 కోట్లు చెల్లించాలి’ అని చెప్పిన అవతల వ్యక్తి కాల్‌ కట్‌ చేశాడు. ఈ విషయాన్ని విజేందర్‌ పోలీసులకు తెలియజేయడంతో వారు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చిన్నారి మృతదేహాన్ని సిమ్రోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరిని అరెస్టుచేశారు. ఈ వ్యవహారంలో జితేంద్ర బంధువు ఒకరి (కజిన్‌) ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు