Bihar: బిహార్‌లో పాత రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు

బిహార్‌లోని సమస్తీపుర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించారు. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు.

Published : 07 Feb 2023 10:39 IST

బిహార్‌లోని సమస్తీపుర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించారు. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు. గతంలో మధుబని లోహత్‌ షుగర్‌ మిల్‌ నుంచి పండోల్‌ స్టేషన్‌ వరకు రైల్వే లైన్‌ వేశారు. ఏళ్ల తరబడి ఈ చక్కెర మిల్లు మూతపడి ఉండటంతో ఈ మార్గం వినియోగంలో లేదు. దీంతో దొంగలు ఈ పట్టాలను తీసుకెళ్లిపోయారు. జనవరి 24న ఈ ఘటన వెలుగు చూసింది. రైల్వేస్టేషన్‌లో పని చేసే అధికారులే ఈ దొంగతనానికి సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీకి బాధ్యుల్ని చేస్తూ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు