Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
దేశ రాజధాని నగరంలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్ (27) హత్యకేసులో పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల చార్జిషీటు పలు విస్తుగొలిపే అంశాలను వెల్లడిస్తోంది.
ఆఫ్తాబ్ కేసు ఛార్జిషీటులో విస్తుపోయే అంశాలు
దిల్లీ: దేశ రాజధాని నగరంలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్ (27) హత్యకేసులో పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల చార్జిషీటు పలు విస్తుగొలిపే అంశాలను వెల్లడిస్తోంది. జనవరి నెలాఖరులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో దాదాపు 150 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. శ్రద్ధా హత్య జరిగిన రోజు ఆమె ప్రియుడు, నిందితుడైన ఆఫ్తాబ్ (28) జొమాటో ద్వారా చికెన్ రోల్ తెప్పించుకొని తిన్నట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ముక్కలుగా నరికిన శ్రద్ధా మృతదేహాన్ని కాల్చి, ఎముకలను స్టోన్ గ్రైండర్ ద్వారా పొడి చేసి విసిరేసినట్లు నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించాడని తెలిపారు. ఆఫ్తాబ్‌కు దిల్లీ నుంచి దుబాయ్ వరకు స్నేహితురాళ్లు ఉన్నట్లు వెల్లడించారు. ‘బంబుల్’ డేటింగ్ యాప్ ద్వారా పలువురు అమ్మాయిలతో అతడు చనువుగా ఉండేవాడని పేర్కొన్నారు. ఈ కేసులో జరిపిన శాస్త్రీయ పరీక్షలు సైతం నేరంలో నిందితుడి ప్రమేయాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించారు. మంగళవారం ఆఫ్తాబ్‌ను కోర్టుకు తీసుకువచ్చినపుడు పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో పటిష్ఠమైన భద్రత కల్పించారు. తలుపులు మూసిన కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి అవిరళ్ శుక్లా కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
VarunTej-Lavanya: వేడుకగా వరుణ్ తేజ్ - లావణ్య నిశ్చితార్థం.. మెగా, అల్లు హీరోల సందడి
-
Politics News
Bhagwant Mann: ‘మీ కుర్చీ.. నా భర్త ఇచ్చిన గిఫ్ట్’: పంజాబ్ సీఎంకు సిద్ధూ భార్య కౌంటర్
-
General News
KCR: ఇకపై దివ్యాంగులకు రూ.4,116 పింఛన్ : కేసీఆర్
-
India News
Sanjay Raut: నన్ను, నా సోదరుడినీ చంపేస్తామని బెదిరింపులు.. సంజయ్ రౌత్
-
Sports News
WTC Final: తొలుత రహానె.. మరోసారి శార్దూల్.. సేమ్ బౌలర్
-
Crime News
Shamshabad: బండరాయితో కొట్టి.. కారు కవర్లో చుట్టి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు