బాలికలపై అత్యాచారం కేసులో.. యువకుడికి జీవిత ఖైదు

ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ విజయనగరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Published : 08 Feb 2023 04:06 IST

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ విజయనగరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మంగళవారం వెల్లడించారు. గతేడాది జనవరిలో కురుపాం మండలం రావాడలోని జలాశయం వద్దకు ఇద్దరు బాలికలు తమ స్నేహితులను కలిసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు(33) వారిని అడ్డుకొని బెదిరించాడు. సమీపంలోని ఆయిల్‌పాం తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.24,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి షేక్‌ సికిందర్‌ బాషా మంగళవారం తీర్పు వెలువరించారు. బాధిత బాలికలకు రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు