Gold: సముద్రంలో విసిరేసిన 12 కిలోల బంగారం స్వాధీనం

రామేశ్వరం వద్ద సముద్రంలో విసిరేసిన 12 కిలోల బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 10 Feb 2023 12:41 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రామేశ్వరం వద్ద సముద్రంలో విసిరేసిన 12 కిలోల బంగారాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు... తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో వలైగుడా ప్రాంతంలో బుధవారం గస్తీ తిరుగుతుండగా సముద్రంలో ఓ పడవ కనిపించింది. పోలీసులు రావడాన్ని చూసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పడవలోని బంగారు బిస్కెట్లను సముద్రంలో పడేశారు. ముగ్గురు నిందితులు ఏమీ లేవని చెప్పారు. దీంతో పోలీసులు అనుమానంతో స్కూబా డైవింగ్‌ చేసే వారిని రప్పించి సముద్రం అడుగున బంగారం కోసం వెతికించారు. మన్నార్‌ వలైగుడా ప్రాంతంలో బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని