Crime News: భార్యను హత్య చేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు
భార్యను దారుణంగా హత్యచేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడో భర్త. ఝార్ఖండ్‌లోని గిరిడీలో 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది.
ఝార్ఖండ్: భార్యను దారుణంగా హత్యచేసి స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడో భర్త. ఝార్ఖండ్‌లోని గిరిడీలో 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీశ్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అర్జుమన్ తన మొదటి భర్త సోదరుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడేది. ఇది నచ్చని మనీశ్ ఆమెను చంపాలనుకున్నాడు. మనీశ్ ఓ రోజు స్వగ్రామానికి వెళ్లే నెపంతో అర్జుమన్‌ను తీసుకుని కారులో బయల్దేరాడు. దారిమధ్యలో అర్జుమన్ మెడకు దుపట్టాను బిగించి చంపాడు. ఆమె మృతదేహాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టి సిమెంట్‌తో పూడ్చిపెట్టాడు. హత్య చేసిన మూడు నెలల తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ మనీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచూ స్టేషన్‌కు వెళ్లి తన భార్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేవాడు. అయితే అర్జుమన్ తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం తమ కుమార్తెను మనీశే హత్యచేసినట్లు అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు అంజుమన్ మృతదేహాన్ని పాతిపెట్టిన చోట తవ్వగా అస్థిపంజరం బయటపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్