మహిళా ప్రిన్సిపల్‌పై పెట్రోల్‌ చల్లి నిప్పంటించిన మాజీ విద్యార్థి

మార్కుల జాబితా ఇవ్వడంలేదని ఆగ్రహించిన పూర్వ విద్యార్థి ఒకడు మహిళా ప్రిన్సిపల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

Updated : 21 Feb 2023 09:58 IST

80% గాయాలు

ఇందౌర్‌: మార్కుల జాబితా ఇవ్వడంలేదని ఆగ్రహించిన పూర్వ విద్యార్థి ఒకడు మహిళా ప్రిన్సిపల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఉజ్జయినికి చెందిన అశుతోష్‌ శ్రీవాస్తవ(24) బీఎం కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ పూర్వ విద్యార్థి. గత ఏడాది జులైలో బి ఫార్మాలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ మార్కుల జాబితా ఇవ్వలేదనే కోపంతో ప్రిన్సిపాల్‌ విముక్త శర్మ(54)పై పెట్రోల్‌ చల్లి, నిప్పంటించాడు. ఆమె శరీరంపై 80శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం కూడా అశుతోష్‌ మార్కుల జాబితా విషయమై కళాశాల ప్రొఫెసర్‌తో గొడవపడి కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. అయితే, మార్కుల జాబితా ఇంకా తమ కళాశాలకు చేరలేదని యాజమాన్యం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని