Andhra News: పరువు హత్య కేసులో మలుపులెన్నో..

నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో పరువు హత్య కేసులో కీలక మలుపులు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 26 Feb 2023 08:21 IST

మృతదేహం తరలింపులో వైకాపా నాయకుడి పాత్ర?

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో పరువు హత్య కేసులో కీలక మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. కన్న తండ్రే కుమార్తెను హతమార్చి తల, మొండెం వేరు చేసి గిద్దలూరు రహదారి అటవీ ప్రాంతంలోని లోయలో పడేసిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హత్యలో ఆలమూరు గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తరలించడంలో గ్రామానికి చెందిన వైకాపా ప్రధాన నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు తెలుసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారనే వదంతులు వస్తున్నాయి. ఆయన్ను గడివేముల పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

ఆయన కారులోనే మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ప్రచారమవుతోంది. మృతురాలి తండ్రి దేవేంద్రరెడ్డితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని పాణ్యంలో విచారిస్తున్నట్లు చెబుతున్నారు. హత్యలో తండ్రితోపాటు మరో నలుగురి ప్రమేయం ఉండొచ్చన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇరుకైన సందులో ఉన్న ఇంట్లో ప్రసన్న గొంతు నులిమి హతమార్చాక మృతదేహాన్ని బయటకెలా తెచ్చారు? కారులో దాదాపు 50 కి.మీ.దూరం వరకు ఎంతమంది తీసుకెళ్లారు? అక్కడ గొంతు ఎందుకు కోయాల్సి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని