Chittoor: కసాయి కొడుకు.. ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపుతూ తండ్రిపై దాడి

కన్నతండ్రిపై పాశవికంగా దాడి చేస్తున్న ఘటనను ఏకంగా వీడియో కాల్‌లో ప్రియురాలికి చూపిన ఓ కసాయి కొడుకు ఉదంతం ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.  

Updated : 27 Feb 2023 07:48 IST

చిత్తూరులో ఓ కుమారుడి అమానుషం

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: కన్నతండ్రిపై పాశవికంగా దాడి చేస్తున్న ఘటనను ఏకంగా వీడియో కాల్‌లో ప్రియురాలికి చూపిన ఓ కసాయి కొడుకు ఉదంతం ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.  దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివసిస్తున్న దిల్లీబాబు హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు భరత్‌(21) మూటలు మోసే కూలీ. కొద్దిరోజుల కిందట నగరంలోని ఓ కాలనీకి చెందిన ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీన్ని గుర్తించిన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు.

అయితే ఆదివారం భరత్‌ తన ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తన తండ్రిపై దాడి చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా వీడియోలో చూపుతూ తండ్రిని కొట్టాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో దిల్లీబాబుకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. దీనిపై చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు