జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు లొంగుబాటు

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ‘సీఎం గోబ్యాక్‌, బిల్ట్ అమరావతి’ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటుచేసిన జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు శనివారం విశాఖ మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు.

Published : 19 Mar 2023 05:20 IST

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ‘సీఎం గోబ్యాక్‌, బిల్ట్ అమరావతి’ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటుచేసిన జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వాసు శనివారం విశాఖ మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. ఈనెల 16న వాసు నేతృత్వంలో ఏయూ ప్రధాన ద్వారం వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వర్సిటీ భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం వాసు కోసం పోలీసులు గాలించి సమితి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే వాసు శనివారం సాయంత్రం నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఆయన్నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని