బాలికలతో అర్ధనగ్న నృత్యాలు చేయించిన టీచర్‌

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించి, వాటిని వీడియోలు తీశాడు.

Updated : 20 Mar 2023 15:31 IST

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించి, వాటిని వీడియోలు తీశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. జబల్‌పుర్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్‌ ఠాకుర్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అతడుఈ నెల 11న..  4, 5వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో పాఠశాల గదిలో బలవంతంగా అర్ధనగ్నంగా నృత్యాలు చేయించాడు. ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని   బెదిరించాడు. ఓ బాలిక ఈ విషయాన్ని తన తల్లికి తెలపడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఆమె చిన్నారుల కుటుంబీకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని