బాలికపై వాలంటీరు అత్యాచారయత్నం

బాలికపై గ్రామ సచివాలయ వాలంటీరు అత్యాచారయత్నం చేసిన సంఘటన తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 20 Mar 2023 04:08 IST

నాగలాపురం, న్యూస్‌టుడే: బాలికపై గ్రామ సచివాలయ వాలంటీరు అత్యాచారయత్నం చేసిన సంఘటన తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై హనుమంతప్ప కథనం మేరకు.. మండలంలోని ఒక గ్రామ వాలంటీరు ఆదివారం మధ్యాహ్నం మద్యం మత్తులో గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలిక (14) ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో పారిపోయాడు. విషయాన్ని బాలిక తల్లికి తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు చేయించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని