రూ.12 కోట్లకు వైకాపా నాయకుడి కుచ్చుటోపీ

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మద్దూరుపాడుకు చెందిన అధికార పార్టీ నాయకుడు, సిమెంట్‌ వ్యాపారి రూ.12 కోట్లకు ఐపీ పెట్టారు.

Updated : 20 Mar 2023 06:15 IST

కావలి, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మద్దూరుపాడుకు చెందిన అధికార పార్టీ నాయకుడు, సిమెంట్‌ వ్యాపారి రూ.12 కోట్లకు ఐపీ పెట్టారు. పట్టణంలోని ఐదులాంతర్ల కూడలిలో ఉన్న అతని సిమెంట్‌ దుకాణాన్ని కొన్నాళ్లుగా తెరవడం లేదు. ఆయన స్థిరాస్తి వ్యాపారం కూడా చేసేవారు. అప్పు ఇచ్చిన పలువురు స్థిరాస్తి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఆస్తులను మించి అప్పులు ఉన్నాయని.. దామాషా ప్రకారం చెల్లించగలనని న్యాయస్థానం నుంచి 44 మందికి నోటీసులు పంపారు. వీటిని సవాల్‌ చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని బంధువుల ఇంట ఆయన కుటుంబం ఉంటోంది. కొంతమంది అక్కడకు వెళ్లి ప్రశ్నించగా వారిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు