క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నడుస్తున్న క్యూ న్యూస్‌ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడిచేశారు.

Published : 20 Mar 2023 04:08 IST

కంప్యూటర్లు, ఫర్నిచర్‌ ధ్వంసం

మేడిపల్లి(బోడుప్పల్‌) న్యూస్‌టుడే: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నడుస్తున్న క్యూ న్యూస్‌ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడిచేశారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లుగా వీడియోల్లో చూపిస్తారా..’’ అంటూ 15-20 మంది వచ్చి విధ్వంసం సృష్టించారని సిబ్బంది తెలిపారు. అడ్డుకోబోయిన తమపై దాడి చేశారని, ఒకర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించామన్నారు. ఘటనపై క్యూన్యూస్‌ కోఆర్డినేటర్‌ సుదర్శన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారాస పార్టీ వారే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని