రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

లారీ, వ్యాను ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిదేళ్ల ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు.

Published : 20 Mar 2023 04:07 IST

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: లారీ, వ్యాను ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిదేళ్ల ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా ఎడప్పాడి నుంచి తిరుచ్చి మీదుగా కుంభకోణం ఆలయానికి బాలిక సహా తొమ్మిది మంది ప్రయాణికులు వ్యానులో బయల్దేరారు. కర్రల లోడుతో తిరుచ్చి నుంచి కరూర్‌కు ఓ లారీ వస్తోంది. ఈ రెండు వాహనాలు తిరుచ్చి జిల్లా తిరువాసి సమీపంలోని టోల్‌గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వ్యానులో ఉన్న ముత్తుస్వామి (58), ఆనందాయి (57), తావణాశ్రీ (9), అప్పు (55), సంతోష్‌కుమార్‌ (31), తిరుమూర్తి (43) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ధనపాల్‌, తిరుమురుగన్‌, శాకుంతలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని