రజనీకాంత్‌ కుమార్తె ఇంట్లో చోరీ

అగ్రనటుడు రజనీకాంత్‌ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 21 Mar 2023 04:13 IST

60 సవర్ల నగలు కనిపించలేదని ఐశ్వర్య ఫిర్యాదు

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: అగ్రనటుడు రజనీకాంత్‌ పెద్ద కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న లాకర్‌ తెరిచి చూడగా.. ఆభరణాలు కనిపించలేదని తెలిపారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని