గంజాయితో పట్టుబడ్డ విదేశీయుడు

గంజాయికి అలవాటు పడిన ఓ విదేశీయుడు విశాఖలో తక్కువ ధరకు దొరుకుతుందని తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తుండగా ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద పోలీసులకు చిక్కాడు.

Updated : 22 Mar 2023 05:43 IST

n

విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: గంజాయికి అలవాటు పడిన ఓ విదేశీయుడు విశాఖలో తక్కువ ధరకు దొరుకుతుందని తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి కొనుక్కుని వెళ్తుండగా ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద పోలీసులకు చిక్కాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలివి. రష్యాకు చెందిన వ్లాదిమిర్‌ ఓబ్రియన్‌ కొన్ని రోజులు క్రితం గోవాకు వచ్చి అక్కడే నివసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి గంజాయికి అలవాటుపడ్డాడు. విశాఖలో తక్కువ ధరకు గంజాయి లభిస్తుందని తెలుసుకొని మంగళవారం నగరానికి వచ్చి వ్యాపారుల వద్ద ఐదు కిలోలు కొనుక్కున్నాడు. విమానంలో వెళితే తనిఖీలుంటాయని రోడ్డు మార్గంలో గోవా వెళ్లేందుకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో బస్టాప్‌ వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీ కోసం వేచి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అంది అతన్ని తనిఖీ చేయగా గంజాయి దొరికింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని ఎయిర్‌పోర్టు పోలీసుస్టేషన్‌కు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు