రజనీకాంత్‌ కుమార్తె ఇంట్లో చోరీ చేసిన పనిమనిషి అరెస్టు

అగ్రనటుడు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో నగలు చోరీ చేసిన పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. తన లాకర్‌లోని 60 సవర్ల నగలు కనిపించడం లేదని ఐశ్వర్య గత నెలలో తేనాంపేట పోలీసులకి ఫిర్యాదు చేశారు.

Published : 22 Mar 2023 05:59 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అగ్రనటుడు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో నగలు చోరీ చేసిన పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. తన లాకర్‌లోని 60 సవర్ల నగలు కనిపించడం లేదని ఐశ్వర్య గత నెలలో తేనాంపేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఇంట్లో ఆర్నెల్ల కిందట పని మానేసిన ఈశ్వరి బ్యాంకు ఖాతాలో రూ.లక్షల్లో నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అనుమానం వచ్చి మందవెళికి చెందిన ఈశ్వరి, ఆమె భర్త అంకముత్తులను విచారించారు. లాకర్‌లోని నగలను రోజు కొన్ని చొప్పున కాజేసినట్లు వారు ఒప్పుకొన్నారు. వాటిని విక్రయించి, కొంత నగదుతో స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. 20 సవర్ల నగలు, రూ. కోటి విలువైన స్థల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని