రూ.7.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత

వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ అధికారులు పట్టుకున్నారు.

Published : 23 Mar 2023 04:21 IST

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల స్వాధీనంచేసుకున్న అధికారులు

ఈనాడు, అమరావతి: వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ కమిషనర్‌ కె.ఇంజినీర్‌ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో 30మంది అధికారులతో కూడిన కస్టమ్స్‌ బృందాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో అయిదు కిలోల బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి మరో 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12.97 కిలోలు సీజ్‌ చేసినట్టు వెల్లడించారు. కస్టమ్స్‌ చట్టం కింద నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 2022-23లో ఇప్పటివరకు విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ. 19.75 కోట్ల విలువైన బంగారం పట్టుకున్నట్టు కమిషనర్‌ ఇంజినీర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని