పోలీసు బూట్ల కింద నలిగి నవజాత శిశువు మృతి

ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయింది.

Published : 24 Mar 2023 04:32 IST

ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయింది. ఆ శిశువు తాతతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేయడానికి అయిదుగురు పోలీసులు బుధవారం తెల్లవారుజామున వారి ఇంటికి వెళ్లారని, పెనుగులాటలో శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో స్టేషన్‌ ఇంఛార్జి సహా మొత్తం ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్‌ చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని