యూపీలో ఉన్మాద హంతకుల అరెస్టు

ఉత్తర్‌ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 24 Mar 2023 04:32 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఉన్మాదులు వృద్ధ మహిళలను చంపి మృతదేహాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరిని రెండు నెలల క్రితం అరెస్టు చేయగా, మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గత డిసెంబరులో బారాబంకీ జిల్లాలో రెండు వరుస హత్యలు కలకలం రేపాయి. నిందితులు బహిర్భూమికి వెళ్లిన వృద్ధ మహిళలను చంపి అత్యాచారం చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుల్లో ఒకరిని సడ్వా బెలూ గ్రామానికి చెందిన అమరేంద్రగా గుర్తించారు. జనవరి 23న అతడు  ఓ వృద్ధురాలిపై దాడికి యత్నించగా.. బాధితురాలు కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా అమరేంద్ర స్నేహితుడు సురేంద్ర కూడా ఈ నేరాల్లో పాలుపంచుకున్నట్లు తెలిసింది. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం సురేంద్రను అరెస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు