తెగిపడిన విద్యుత్తు తీగ.. షాక్‌తో కౌలు రైతు మృతి

పేద కౌలు రైతును విద్యుత్తు తీగ రూపంలో విధి బలి తీసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Mar 2023 05:28 IST

పెంటపాడు, న్యూస్‌టుడే: పేద కౌలు రైతును విద్యుత్తు తీగ రూపంలో విధి బలి తీసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పెంటపాడులోని కూనాకరపేటకు చెందిన తాడి దానిరెడ్డి (59) మూడేకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అతని భార్య సోమలక్ష్మి పక్షవాతంతో బాధ పడుతూ ఇంటికే  పరిమితమయ్యారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా.. వారికి వివాహాలు అయిపోయాయి. బుధవారం రాత్రి  వరి చేనుకు నీరు పెట్టేందుకు దానిరెడ్డి పొలానికి వెళ్లగా.. అక్కడ ఎల్‌టీ విద్యుత్తు లైను నుంచి తెగిన తీగపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు