సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు.. యువతి బలవన్మరణం

సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడ్‌ నం2లోని ఇందిరానగర్‌నగర్‌వాసి ఆర్‌.సదానంద్‌ ప్రైవేటు ఉద్యోగి.

Updated : 25 Mar 2023 04:56 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడ్‌ నం2లోని ఇందిరానగర్‌నగర్‌వాసి ఆర్‌.సదానంద్‌ ప్రైవేటు ఉద్యోగి. అదే ప్రాంతంలో నివసించే రెడపాక పల్లవి(27)తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తరువాత పల్లవి సహజీవనం కొనసాగింది. కొద్ది రోజులుగా సదానంద్‌ అకారణంగా ఆమెపై దాడికి పాల్పడుతున్నాడు. ఈనెల 22న రాత్రి 10 గంటలకు పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తిలో నివసించే తల్లికి పల్లవి ఫోన్‌ చేసి సదానంద్‌ తనను తీవ్రంగా కొడుతున్నాడని, చనిపోవాలని.. లేదంటే పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నాడని చెప్పింది. 23న తల్లి అక్కడి నుంచి బయలుదేరగా మార్గమధ్యలో ఉండగానే సదానంద్‌ ఫోన్‌ చేసి, రాత్రి పల్లవి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపాడు. నగరానికి చేరుకున్న ఆమె తల్లి లక్ష్మి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సదానంద్‌ను అదుపులోకి తీసుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు