Crime News: కొండపైకి గంజాయి.. తితిదే ఉద్యోగి అరెస్టు

తిరుమలకు గంజాయిని తరలిస్తున్న తితిదే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని తిరుమల ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Updated : 25 Mar 2023 08:37 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలకు గంజాయిని తరలిస్తున్న తితిదే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని తిరుమల ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన గంగాద్రి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఎస్‌ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతని వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సాయంత్రం విడుదలైన ఓ వీడియోలో నిందితుడు గంజాయిని ప్లాస్టిక్‌ కవర్‌లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి, వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు వచ్చినట్లుగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు