ఇంట్లోకి చొరబడి దుండగుల కాల్పులు.. 8 ఏళ్ల బాలిక మృతి

బిహార్‌లోని భోజ్‌పుర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Published : 26 Mar 2023 04:25 IST

ఆస్తి వివాదాలే కారణం!

బిహార్‌లోని భోజ్‌పుర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆస్తి వివాదం నేపథ్యంలో నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి భిలాయి గ్రామానికి చెందిన కృష్ణసింగ్‌ ఇంట్లోకి నలుగురు వ్యక్తులు తుపాకులతో చొరబడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో కృష్ణసింగ్‌ కుమార్తె ఆరాధ్య ప్రాణాలు కోల్పోయింది. 25 ఎకరాల భూమికి సంబంధించి ఓ వ్యక్తితో తనకు వివాదం నడుస్తోందని, అతడే తన కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడని కృష్ణ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వివాదంలో నాలుగేళ్ల క్రితం తన సోదరుణ్ని కూడా చంపారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని